‘వోకార్డ్‌ బ్రాండ్‌’లు డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి

ABN , First Publish Date - 2020-06-11T07:48:57+05:30 IST

వోకార్డ్‌ బ్రాండెడ్‌ జనరిక్స్‌ వ్యాపారానికి చెందిన కొన్ని విభాగాల కొనుగోలు ప్రక్రియను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పూర్తి చేసింది. కొనుగోలులో నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులకు చెందిన కొన్ని విభాగాలు కూడా ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది...

‘వోకార్డ్‌ బ్రాండ్‌’లు డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వోకార్డ్‌ బ్రాండెడ్‌ జనరిక్స్‌ వ్యాపారానికి చెందిన కొన్ని విభాగాల కొనుగోలు ప్రక్రియను డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ పూర్తి చేసింది. కొనుగోలులో నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులకు చెందిన కొన్ని విభాగాలు కూడా ఉన్నాయని డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. శ్వాసకోశ, న్యూరాలజీ, డెర్మటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ తదితర విభాగాలకు చెందిన 62  బ్రాండ్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారం పెంపు  వ్యూహంలో భాగంగా ఈ కొనుగోలు చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ఎండీ జీవీ ప్రసాద్‌ తెలిపారు.  


Updated Date - 2020-06-11T07:48:57+05:30 IST