వైసీపీ ప్రభుత్వంపై వర్ల సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2020-05-24T23:06:08+05:30 IST

డాక్టర్ సుధాకర్‌ను బలి చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై వర్ల సంచలన ఆరోపణలు

అమరావతి: డాక్టర్ సుధాకర్‌ను బలి చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పిచ్చివానిగా మార్చడానికి వైద్యం చేస్తున్నారా? నయం కావడానికి వైద్యం చేస్తున్నారా? దళితులంటే పడదా? అసహ్యం, కోపం ఎందుకు? ’’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సుధాకర్‌కు పారదర్శకంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. 


చట్టబద్దంగా విధులు నిర్వహించాలని అధికారులను కోరారు. వైసీపీ దళిత ప్రతినిధులు సుధాక‌ర్‌కు ధైర్యం చెప్పలేరా? అని అడిగారు. రాష్ట్రంలో అనైతిక, అరాచక పరిపాలన జగన్ చేస్తున్నారని, అప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక పాలన అని విమర్శించారు. సుధాకర్ వైద్యంపై హెల్త్ బులెటిన్ ప్రకటించాలన్నారు. ప్రైవేట్ డాక్టర్ల బృందాన్ని పెట్టక పొతే ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లేనన్నారు. సుధాకర్‌కు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. సుదాకర్‌కు వైద్యం అందించడంలో పారదర్శకంగా వ్యవహరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ‘చలో విశాఖ’ దారి పడతాయని హెచ్చరించారు. వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడిన మంత్రి సురేష్, ఎంపీ విజయసాయి రెడ్డిల ఫోన్ కాల్ లిస్టు విడుదల చేయాలన్నారు. సస్పెండ్ అయ్యేనాటికి సుధాకర్ ఎలా ఉన్నారో అలానే తిరిగి అప్పగించాలని వర్ల రామయ్య కోరారు.  

Updated Date - 2020-05-24T23:06:08+05:30 IST