అంతుపట్టని వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలి : జన విజ్ఞాన వేదిక

ABN , First Publish Date - 2020-12-14T04:42:27+05:30 IST

సీఐటీయూ కార్యాలయం లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతుపట్టని వ్యాధి పట్ల తీసుకో వాల్సిన చర్యలపై అవగాహన సదస్సును నిర్వహించారు.

అంతుపట్టని వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలి : జన విజ్ఞాన వేదిక
సదస్సులో మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధి

ఏలూరు కార్పొరేషన్‌, డిసెంబరు 13 : సీఐటీయూ కార్యాలయం లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అంతుపట్టని వ్యాధి పట్ల తీసుకో వాల్సిన చర్యలపై అవగాహన సదస్సును నిర్వహించారు. జన విజ్ఞా న వేదిక జిల్లా కార్యదర్శి ఐ.వి.సుధాకర్‌ అధ్యక్షతన ఆదివారం జరి గిన ఈ సదస్సులో వైద్య నిపుణులు డాక్టర్‌ పి.ఎ.ఆర్‌.ఎస్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజలు తీసుకునే ఆహారం, మంచినీరు పట్ల జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు.  జెవీవీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ఎన్‌.రమేశ్‌ మాట్లాడుతూ అంతుపట్టని వ్యాధితో ప్రజల ముందు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పారిశుధ్యం సక్రమంగాలేదని, పోణంగి డంపింగ్‌ యార్డు తప్పితే వేరే లేవన్నారు. రిటైర్డ్‌ లెక్చరర్‌ ఎల్‌.వెంకటేశ్వరరావు మాట్లా డుతూ గతవారం రోజులుగా అంతుపట్టని వ్యాధి  నగర ప్రజలను పీడిస్తుందన్నారు. దీని నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దోమలు, పందులు, కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని, శుద్ధి చేసిన మంచినీటిని సర ఫరా చేయాలని ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు కోరారు. వన్‌టౌన్‌లోని అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ మంచినీటిలో కలుషితం అవుతోందని, దీని నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య డిమాండ్‌ చేశారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు వి.వి.ఎన్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:42:27+05:30 IST