బిల్లులు చెల్లించాలని ఇసుక కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-06-25T10:14:31+05:30 IST

ఇసుక తీత కార్మికులు, బోటు యజమానులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లిం చాలని, మూసి వేసిన ఇసుక

బిల్లులు చెల్లించాలని ఇసుక కార్మికుల ఆందోళన

యలమంచిలి/నరసాపురం, జూన్‌ 24 : ఇసుక తీత కార్మికులు, బోటు యజమానులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులను వెంటనే చెల్లిం చాలని, మూసి వేసిన ఇసుక ర్యాంపులను తక్షణం తెరవాలని కార్మికులు ఆం దోళన చేశారు.యలమంచిలిలంక గ్రామంలోని ఇసుక ర్యాంపు వద్ద బుధవారం కార్మికులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు.


బాతిరెడ్డి జార్జి మాట్లాడుతూ ఇసుక తీత కార్మికులకు వారానికి రెండు సార్లు బిల్లులు చెల్లిస్తామని చెప్పిన అధికారులు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.బిల్లులను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నరసాపురం పట్టణంలోని నెల రోజులుగా పడవ యజమానులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో పెట్టుబడులు పెట్టలేక వారం రోజులుగా నిర్వాహకులు పడవలను నిలిపివేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాస్‌, నాగేశ్వరరావు, గంగాధరం,ఏసుబాబు, చింతా నాగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T10:14:31+05:30 IST