ఉపాధ్యాయుల అక్రమ నిర్బంధం తగదు

ABN , First Publish Date - 2020-12-17T06:09:11+05:30 IST

ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులు అన్యాయమని ఏపీ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రెడ్డి దొర, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎ. విక్టర్‌ అన్నారు.

ఉపాధ్యాయుల అక్రమ  నిర్బంధం తగదు


కొయ్యలగూడెం, డిసెంబరు 15: ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులు అన్యాయమని ఏపీ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రెడ్డి దొర, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎ. విక్టర్‌ అన్నారు. బుధవారం స్థానిక మండల వనరుల కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. వెబ్‌ కౌన్సిలింగ్‌ విధానం రద్దు చేసి మాన్యూవల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని,  అన్ని ఖాళీలను చూపాలని డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌కు ఇచ్చిన ఛార్జ్‌ మెమోలను ఉపసంహరించుకోవాలని  డిమాండ్‌ చేశారు. 

తాళ్లపూడి: ఉపాధ్యాయులను అక్రమ నిర్బంధం  తగదని ఏపీటీఎఫ్‌ జిల్లాశాఖ కార్యదర్శి దున్నా దుర్గారావు  అన్నారు. ఉపాధ్యాయులు వెబ్‌ ట్రాన్స్‌ఫర్స్‌, పోస్టుల బ్లాకింగ్‌ను వ్యతిరేకిస్తూ  ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపినా విద్యాశాఖ అధికారులు నియంత పోకడలు మానకపోవడంతో  విధిలేక  సెక్రటేరియేట్‌ ముట్టడికి వెళుతున్న  ఉపాధ్యాయులకు అక్రమంగా నోటీసులు జారీ చేసి నిర్బంధించడం వేధింపులకు గురిచేయడమేనన్నారు.  పోలీస్‌లు అరెస్ట్‌ చేసినవారిలో దున్నా దుర్గారావు, గోపాలపురం ప్రధాన కార్యదర్శి సనపల రాజశేఖర్‌ ఉన్నారు.

కుక్కునూరు:  తమ డిమాండ్ల సాధనకు సెక్రటేరియెట్‌  ముట్టడిలో పాల్గొన్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడంపై కుక్కునూరు మండల ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ ఫ్యాప్టో ఆధ్వర్యంలో బుధవారం నిరసన తెలిపాయి. ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా వెబ్‌ కౌన్సిలింగ్‌ను రద్దు చేసి మాన్యువల్‌గా జరపాలని బదిలీల్లో చాలా పాఠశాలల్లో ఉన్న ఖాళీలను చూపించకుండా బ్లాక్‌ చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు.  ఉపాధ్యాయులు ఎండీ అజ్గర్‌ అలీ, బి.వాసు, ఎన్‌. శిరీష, మంగ, ముషబర్‌, వి.నాగేశ్వరరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.   


Updated Date - 2020-12-17T06:09:11+05:30 IST