తణుకు మునిసిపల్‌ ఎన్నికలు లేనట్టే..!

ABN , First Publish Date - 2020-03-08T11:40:23+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికలకు తణుకు పురపాలక సంఘం దూరం కానుంది. కోర్టు కేసుల కార ణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. 2014 ఎన్నికలకు ముందు

తణుకు మునిసిపల్‌ ఎన్నికలు లేనట్టే..!

గతంలో గ్రామాల విలీనంపై కోర్టులో కేసులు 

 ఎన్నికలకు అడ్డంకి

తణుకు, మార్చి 7: మునిసిపల్‌ ఎన్నికలకు తణుకు పురపాలక సంఘం దూరం కానుంది. కోర్టు కేసుల కార ణంగా ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. 2014 ఎన్నికలకు ముందు వెంకటరాయపురం, వీరభద్రపురం, పైడిపర్రు గ్రామాలను మునిసిపాలిటీలో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పంచాయతీల పరిధిలోని ఓటర్లు అప్పటి మునిసిపల్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత విలీన ప్రక్రియలో పారదర్శకత లేదని వెంకటరాయపురం, పైడిపర్రుకు చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయించా రు. ఆ కేసులు ప్రస్తుత ఎన్నికలకు అడ్డంకి అయ్యాయి. 


టౌన్‌షిప్‌తో ముసలం

2014లో కౌన్సిల్‌ ఏర్పడిన తరువాత వెంకటరాయపురం టౌన్‌షిప్‌గా ఉంచాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వెంకటరాయపురం టౌన్‌షిప్‌లో ఉండాలని రెండు సంవత్సరాలకు తీర్పునిచ్చింది. దీనితో కొంతమంది వెంకటరాయపురం మాదిరిగానే పైడిపర్రును కూడా మునిసిపాలిటీ నుంచి వేరుచేయాలని కోర్టునాశ్రయించారు. వీరభద్రపురం గ్రామ విలీనంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమ య్యాయి. దీనితో మునిసిపల్‌ ఎన్నికలకు బ్రేక్‌ పడింది


ఆర్థిక సంఘం నిధులు వస్తాయా..?

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే కచ్చితంగా పాలకవర్గం ఉండాలి. పాలకవర్గం లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసే అవకాశం ఉండదు. ఏటా రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 7.5 కోట్లు మునిసిపాలిటీ కోల్పోయే అవకాశాలున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-03-08T11:40:23+05:30 IST