11 వేల మోడల్‌ ఇళ్ల కాలనీలకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-12-07T05:41:41+05:30 IST

సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈనెల 25న రాష్ట్రంలో 11 వేల మోడల్‌ ఇళ్ల కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథ రాజు తెలిపారు.

11 వేల మోడల్‌  ఇళ్ల కాలనీలకు శ్రీకారం

 రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

యండగండి(ఉండి), డిసెంబరు 6 : సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈనెల 25న రాష్ట్రంలో 11 వేల మోడల్‌ ఇళ్ల కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథ రాజు తెలిపారు. ఉండి మండలం యండగండిలో మోడల్‌ కాలనీ ని ర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలిం చారు. గృహనిర్మాణశాఖ అధికారులతో కాలనీలో నిర్మించే గృహం ఏవిధంగా ఉండాలో సూచనలు చేశారు. ఇళ్ల లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణంలో నాణ్యతను తెలుసుకోవడానికి లబ్ధిదారులతో కన్‌స్ట్రక్షన్‌ కమ్‌ మానటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. లబ్ధిదారు లందరూ ఒకేసారి ఇళ్లు నిర్మించుకుంటే ఖర్చులు తగ్గుతాయన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు కావలసిన ఇసుక, సిమెంటు, ఐరన్‌ సబ్సిడీపై అందజేస్తామన్నారు. అర్హత వున్న ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ జిల్లా పీడీ రామచంద్రారెడ్డి, ఈఈ సుబ్రహ్మణ్యం, డీఈ, ఏఈ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T05:41:41+05:30 IST