కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-26T04:56:51+05:30 IST

కార్యకర్తల సంక్షేమం పట్టించుకునే ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చేగొండి సూర్యప్రకాశ్‌ అన్నారు.

కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యం
పెదమల్లంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు

ఆచంట, నవంబరు 25: కార్యకర్తల సంక్షేమం పట్టించుకునే ఏకైక పార్టీ జనసేన మాత్రమేనని నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌  చేగొండి సూర్యప్రకాశ్‌ అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెదమల్లం మాచేనమ్మ ఆలయం వద్ద ప్రారంభించారు. అనంతరం గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో చేగొండి సూర్యప్రకాశ్‌తో పాటు తాడేపల్లిగూడెం, తణుకు పార్టీల ఇన్‌చార్జ్‌లు బొలిశెట్టి శ్రీనివాస్‌, విడివాడ రామచంద్రరావు మాట్లాడారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ 5 లక్షల ప్రమాద బీమాతో పాటు రూ50వేలు ఆరోగ్య బీమా వర్తింస్తుందన్నారు. రాష్ట్ర పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిపోయిందన్నారు. ప్రభు త్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పెట్టి అభివృద్ధిని మూలన పడేసిందని విమర్శించారు. సమావేశంలో ఉండి జనసేన నాయకులు అనిల్‌, ఎ.రమేష్‌, జవ్వాది బాలాజీ, గంధం రంగారావు, గణేశుల నూకయ్య, దిరిశాల అబ్బులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more