‘శారద గ్రంథాలయ భవనం’పై పూర్తి వివరాలు సమర్పించండి

ABN , First Publish Date - 2020-12-17T06:44:18+05:30 IST

తాడేపల్లిగూడెం లో సతిహిత సమాజానికి చెందిన శారద గ్రంథాలయ భవ నం అక్రమ మార్గంలో పరాధీనమైందని పేర్కొంటూ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది.

‘శారద గ్రంథాలయ భవనం’పై పూర్తి వివరాలు సమర్పించండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం లో సతిహిత సమాజానికి చెందిన శారద గ్రంథాలయ భవ నం అక్రమ మార్గంలో పరాధీనమైందని పేర్కొంటూ మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిల్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వై.సోమరాజు వాదనలు వినిపిస్తూ.. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కొంతమంది అక్రమ పద్ధతుల్లో రిజిస్టర్‌ చేయించుకున్నారని, దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఆ భవ నం కూల్చివేసి, అదే ప్రాంతంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఆయన వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంట ర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. 


Updated Date - 2020-12-17T06:44:18+05:30 IST