రైతు చట్టాలు రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం

ABN , First Publish Date - 2020-12-19T06:07:44+05:30 IST

నూతన రైతు చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఐ నాయకుడు మన్నవ కృష్ణ చైతన్య హెచ్చరించారు.

రైతు చట్టాలు రద్దు చేయకుంటే ఆందోళన ఉధృతం

జంగారెడ్డిగూడెం టౌన్‌, డిసెంబరు 18: నూతన రైతు చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఐ నాయకుడు మన్నవ కృష్ణ చైతన్య హెచ్చరించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాల్గో రోజు రిలే దీక్షను కృష్ణ చైతన్య, సీపీఎం నాయకుడు  జీవరత్నం, న్యూ డెమొక్రసీ నాయకుడు కారం రాఘవ ప్రారంభించారు. ఇకనైనా కేంద్రం నూతన రైతు చట్టాలను రద్దుచేయకుంటే  ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 21న ధర్నాను జయప్రదం చేయాలి చింతలపూడి: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని మండల అఖిలపక్ష కమిటీ పిలుపు నిచ్చింది. స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధర్నా జయ ప్రదం చేయడానికి మద్ధతు ఇస్తున్న పార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ నాయకుడు ఆర్‌వి సత్యనారాయణ తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ కార్యదర్శి ఎం. థామస్‌, సీపీఎం నాయకుడు సూర్యకుమార్‌, రైతు సంఘం నాయకులు ఎస్‌కె కాలేషా, దొంతా కృష్ణ, సీపీఐ నాయకుడు కె. గురవయ్య, సీపీఐ ఎంఎల్‌ నాయకుడు రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగడాలతో రైతుల ప్రదర్శన

ద్వారకాతిరుమల:  కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు,  మాజీ సర్పంచ్‌ సిర్రా భరత్‌ అన్నారు. ఢిల్లీలో   రైతుల  పోరాటానికి మద్దతుగా ఎం. నాగులపల్లిలో రైతులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.   రైతు నేతలు గారపాటి సత్యనారాయణ, పెద్దిరాజు నాగరాజు పాల్గొన్నారు. 

 21న  కాంగ్రెస్‌ నిరసనలు

కొవ్వూరు:  రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ  21న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు మార్టిన్‌ లూథర్‌ అన్నారు. శుక్రవారం కాపవరంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు బేగ్‌ నివాసంలో మైనార్టీ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా  బేగ్‌ను సత్కరించారు.  డిసెంబరు 21న అన్ని మండల కేంద్రాలలో  వ్యవసాయ చట్టాల రద్దు  కోరుతూ నిరసన తెలపాలన్నారు. 


Updated Date - 2020-12-19T06:07:44+05:30 IST