రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-11-16T05:02:58+05:30 IST

గర్భాం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చంటి (ఫైల్‌)


  మరొకరికి తీవ్ర గాయాలు

మెరకముడిదాం, నవంబరు 15: గర్భాం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గర్భాం గ్రామానికి చెందిన పెంకి చంటి(32), మిత్రుడు పాతరపల్లి ఈశ్వరరావు తో కలిసి బైకుపై గరివిడి వైపు నుంచి గర్భాం గ్రా మానికి వస్తున్నారు. గర్భాం గ్రామ సమీపాన రహ దారి పక్కనేఉన్న మట్టి దిబ్బను ఢీకొనడంతో బైకు పల్టీలు కొట్టింది. బైకు నడుపుతున్న ఈశ్వరావుకు గాయాలు కాగా, వెనుక కూర్చొ న్న చంటికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరినీ 108 వాహనంతో చీపురుపల్లి సీహెచ్‌సీకి తరలిస్తుండగా చంటి మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఈశ్వరరావు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. మృతుడు చంటికి భార్య భారతి, ఇద్దరు ఆడపిల్లలు ఆరాధ్య, దీక్షిత ఉన్నారు. సమాచారం అందుకున్న బుధరాయివలస పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. ఎస్‌ఐ రవి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2020-11-16T05:02:58+05:30 IST