రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు

ABN , First Publish Date - 2020-12-14T05:19:51+05:30 IST

శృంగవరపుకోట పుణ్యగిరి రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి వేస్తుండడంతో వాహనచోదకులు, ప్రజలు రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డులో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యం ఉండడంతో మరింత ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది.

రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు
పుణ్యగిరి రోడ్డులో నిత్యం ఇదే సమస్య

రోడ్డుపైనే వాహనాల నిలిపివేత

రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ప్రజలు

పూర్తిస్థాయిలో జరగని విస్తరణ పనులు

నిమ్మకునీరెత్తినట్టు పంచాయతీరాజ్‌ శాఖ

(శృంగవరపుకోట)

శృంగవరపుకోట పుణ్యగిరి రోడ్డులో ట్రాఫిక్‌ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి వేస్తుండడంతో వాహనచోదకులు, ప్రజలు రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డులో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యం ఉండడంతో మరింత ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. రోడ్డు విస్తరణ కొంతవరకు జరిగినా ట్రాఫిక్‌ ఇబ్బందు లు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ రోడ్డులోనే ఉండడం, పుణ్యగిరి దేవాలయం, దారగంగమ్మ తదితర ఆలయాలకు వెళ్లే భక్తులకు ఇదే ప్రధాన రహదారి. 

పూర్తికాని రోడ్డు విస్తరణ

ఈ రహదారి విస్తరణకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని రూ.కోటి వరకు మంజూరు చేయించారు. ఈ నిధులు దేవి ఆలయం నుంచి సూర్యనారాయణ దేవాలయం వరకు రూ.45లక్షలు, అక్కడి నుంచి రైల్వే గేట్‌ వరకు రూ.55లక్షలు రెండు బిట్లుగా విడదీసి విస్తరణ పనులను పంచాయతీ రాజ్‌ శాఖకు అప్పగించారు. ఇందులో సగ భాగం వరకు 40 అడుగుల వెడల్పుతో విస్తరించి మిగిలిన పనులు అలాగే ఉండిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు అలాగే కొనసాగుతున్నాయి. దీనిపై పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులను ప్రశ్నిస్తే... పనులు చేస్తామని తాపీగా చెబుతుండడం గమనార్హం. 


Updated Date - 2020-12-14T05:19:51+05:30 IST