పక్కాగా టెన్త్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-02T10:09:10+05:30 IST

పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేస్తు న్నామని, ఎక్కడా అక్రమాలు జర గకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి

పక్కాగా టెన్త్‌ పరీక్షలు

  • అన్ని కేంద్రాల్లోనూ పూర్తిస్థాయిలో సౌకర్యాలు
  • జిల్లావ్యాప్తంగా 57400 మంది హాజరు
  • డీఈఓ లింగేశ్వరరెడ్డి

దేవరాపల్లి: పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేస్తు న్నామని, ఎక్కడా అక్రమాలు జర గకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కాశీపురంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 251 పరీక్షా కేంద్రాల్లో 57,400 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్టు చెప్పారు. ఏ కేంద్రంలోనూ పిల్లలు కింద కుర్చోని పరీక్షలు రాయకుండా పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌, విద్యుత్‌ సౌకర్యం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫర్నిచర్‌ లేని 28 కేంద్రాలకు పక్క పాఠశాలల నుంచి బెంచీలు తెప్పిస్తున్నామన్నారు. ఈసారి మెరు గైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలి పారు. వంద రోజుల ప్రణాళిక, స్పెషల్‌ ఫోకస్‌ ఆన్‌ టెన్త్‌, ప్రతిరోజూ హోప్‌ టెస్టులు నిర్వహిస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులను ఇన్విజిలేటర్లగా నియమిస్తారా అని విలేకరులు ప్రశ్నిం చగా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. 1160 పాఠశాలల్లో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా తొలి విడత మరుగుదొడ్ల నిర్మిస్తున్నా మన్నారు. ఇందుకు 23 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.ఆయనతో పాటు ఎంఈఓ రవీంద్రబాబు ఉన్నారు.

Updated Date - 2020-03-02T10:09:10+05:30 IST