జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుంది

ABN , First Publish Date - 2020-11-27T05:38:49+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు.

జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుంది

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్‌


అనకాపల్లి, నవంబరు 26: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తీరుతో అంబేడ్కర్‌ ఆత్మ ఘోషిస్తుందని ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగం సంక్షోభంలో పడి 18 నెలలు అయిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారన్నారు. అంబేడ్కర్‌పై ఏమాత్రం అభిమానం ఉన్నా అమరావతిలోని స్మృతివనం పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానాలకు కులముద్రలు వేసి దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగ ధిక్కరణ జరుగుతోందన్నారు. స్వతంత్ర వ్యవస్థ ఎన్నికల సంఘంపై కక్ష కట్టారన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు జగన్‌ అహంకారానికి గురవుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అక్రమ కేసులు పెట్టి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం ఏ ఒక్క రోజైనా జగన్‌రెడ్డి నడుచుకున్నారేమో ఆత్మవిమర్శ చేసుకోవాలని జగదీశ్‌ హితవు పలికారు.


రుణ పరపతి పెంచుకోడానికే పన్నుల భారం

రాష్ట్ర ప్రభుత్వం రుణ పరపతిని పెంచుకోవడానికే ప్రజలపై పన్నుల భారం వేస్తున్నదని ఎమ్మెల్సీ బుద్ద అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలను రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ నుంచి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా స్థానిక సంస్థల స్వయం సమృద్ధి పేరుతో ప్రజలపై భారాలు మోపడం శోచనీయమన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిందిపోయి పన్నులు పెంచడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2020-11-27T05:38:49+05:30 IST