1 నుంచి సమగ్ర భూ సర్వే

ABN , First Publish Date - 2020-12-16T05:15:13+05:30 IST

మండల వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని స్థానిక తహసీల్దార్‌ బీవీ రాణి తెలిపారు.

1 నుంచి సమగ్ర భూ సర్వే
తహసీల్దార్‌ బీవీ రాణి

తహసీల్దార్‌ బీవీ రాణిపరవాడ, డిసెంబరు 15: మండల వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని స్థానిక తహసీల్దార్‌ బీవీ రాణి తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనవరి 1న నిర్వహించే సమగ్ర భూ సర్వే కోసం పరవాడ గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. మొదటి విడతగా పరవాడ, ఈ-మర్రిపాలెం, కన్నూరు, మంత్రిపాలెం, భరణికం, స్వయంభూవరం గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. మండలంలో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ పక్కాగా జరుగుతుందని, ద్రోన్లు, రోవర్స్‌ తదితర అత్యాఽధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సర్వే చేస్తామన్నారు. రైతులంతా సర్వే పనులు ప్రారంభ సమయంలో తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 


Read more