కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-07-19T10:08:41+05:30 IST

జిల్లాలోని 34 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఏడు, ఎనిమిది తరగతుల ప్రవేశాల కోసం బడి మానేసిన,

కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వెంకోజీపాలెం, జూలై 18: జిల్లాలోని 34 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఏడు, ఎనిమిది తరగతుల ప్రవేశాల కోసం బడి మానేసిన, బడి బయట, అనాథ, పాక్షిక అనాథ, దివ్యాంగ బాలికలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ, బీపీఎల్‌ వర్గానికి చెందిన బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్త బి.మల్లికార్డునరెడ్డి తెలిపారు.


17 కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు పదో తరగతి పాసైన అనాథ, పాక్షిక అనాథ, దివ్యాంగ బాలికలు, ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ, మైనారిటీ, బీపీఎల్‌ వర్గానికి చెందిన బాలికల నుంచి కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు రెండులోగా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  మరిన్ని వివరాలకు 9492247388, 0891-2792020 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-07-19T10:08:41+05:30 IST