అంబేడ్కర్‌ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

ABN , First Publish Date - 2020-12-07T06:01:28+05:30 IST

అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ సూచించారు.

అంబేడ్కర్‌ ఆశయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి పల్లా తదితరుల నివాళి

విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌

మహారాణిపేట/డాబాగార్డెన్స్‌, డిసెంబరు 6: అంబేడ్కర్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ సూచించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన కొరవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమసమాజ నిర్మాణం కోసం పాటుపడిన వారే నిజమైన అంబేడ్కర్‌ వారసులని అన్నారు.


ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వానపల్లి రవికుమార్‌, నక్కా కనకరాజు, ఆళ్ల అప్పలనారాయణ, విల్లూరి చక్రవర్తి, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్లా డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా 31వ వార్డు పార్టీ నాయకులు వానపల్లి రవికుమార్‌ సమకూర్చిన దుప్పట్లు, ఆహారం పొట్లాలను పేదలకు అందించారు. 

 

Updated Date - 2020-12-07T06:01:28+05:30 IST