మన్యంలో 5 మందుపాతరలు

ABN , First Publish Date - 2020-12-06T06:06:16+05:30 IST

మన్యంలోని పెదబయలు మండలం చింతలవీధి, సాలెబు, ఇంజరి, ననాబరి, ముంచంగి పుట్టు మండలం సరియాపల్లి గ్రామాల్లో మావోయిస్టులు మందుపాతరలు అమర్చినట్టు తమకు సమాచారం అందిందని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు చెప్పారు.

మన్యంలో 5 మందుపాతరలు
ఎస్పీ కృష్ణారావు

రూరల్‌ ఎస్పీ కృష్ణారావు ప్రకటన

ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

మావోయిస్టుల పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత

మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు

సీలేరు-ముంచంగిపుట్టు మార్గంలో 150 సెల్‌టవర్లు ఏర్పాటు


విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని పెదబయలు మండలం చింతలవీధి, సాలెబు, ఇంజరి, ననాబరి, ముంచంగి పుట్టు మండలం సరియాపల్లి గ్రామాల్లో మావోయిస్టులు మందుపాతరలు అమర్చినట్టు తమకు సమాచారం అందిందని రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు చెప్పారు. శనివారం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఆ మందుపాతరలు పెట్టారన్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే మార్గంలోనే ఈ మందుపాతరలు పెట్టినందున...ఆయా గ్రామస్థులు జాగ్ర త్తగా ఉండాలన్నారు. పోలీసులు ప్రకటించేంత వరకు అటుగా ఎవరూ వెళ్లొ ద్దని ఎస్పీ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఇప్పటికే వీఆర్వో, సచివాలయ సిబ్బం దికి సమాచారం అందించామన్నారు.  గతంలో చింతలవీధిలో మందుపా తరలు పేలి ఇద్దరు గిరిజనులు మృతిచెందిన విషయాన్ని ఆయన గుర్తుచే శారు. గిరిజనుల పక్షాన పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మావోయి స్టులు...వారి ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మావో యిస్టుల పట్ల గిరిజనుల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ముఖ్యంగా యువత విముఖత చూపుతోందన్నారు. అయితే కొన్ని సరిహద్దు గ్రామాల ప్రజల సాయంతో మావోయుస్టులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుగుతున్న సమయంలోనే పలుచోట్ల మిలీషియా సభ్యులు లొంగిపొతున్నారని తెలిపారు. లొంగిపోయున సభ్యులకు సంకల్పం పేరిట 120 రోజుల బ్రిడ్జి కోర్సు అందిస్తామన్నారు. పీఎల్‌జీఏ వారోత్సవాల్లో సమావేశాలు నిర్వహించే యాక్షన్‌ టీమ్‌ల కోసం ఇటు విశాఖ పోలీసులు, అటు ఒడిశా పోలీసులు కూడా ప్రస్తుతం సరిహద్దులో కూంబింగ్‌ ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీలో పలు గ్రామాలకు  కేంద్రం సాయంతో రోడ్లు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. గాలికొండ, జర్రెలతోపాటు మరికొన్ని రహదారుల విస్తరణకు రోడ్లు భవనాల శాఖ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. సీలేరు నుంచి ముంచంగిపుట్టు వరకు 150 ప్రాంతాల్లో సెల్‌టవర్లు ఏర్పాటుకు టెలికం శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు.

Updated Date - 2020-12-06T06:06:16+05:30 IST