అత్యాధునిక వసతులతో 108 వాహనాలు

ABN , First Publish Date - 2020-07-10T09:59:15+05:30 IST

అత్యాధునిక వసతులతో విశాఖ జిల్లాకు 108 వాహనాలు 43, అలాగే 104 వాహనాలు 42 సమకూర్చామని ..

అత్యాధునిక వసతులతో 108 వాహనాలు

విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి) : అత్యాధునిక వసతులతో విశాఖ జిల్లాకు 108 వాహనాలు 43, అలాగే 104 వాహనాలు 42 సమకూర్చామని అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ సాయిరామ్‌ స్వరూప్‌ తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా 2500 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ప్రస్తుతం కరోనా అత్యవసర పరిస్థితుల్లో 108కు ఫోన్‌ చేసే వ్యక్తులు కరోనాతో బాధపడుతున్నట్టు ముందే చెబితే అందుకు అనుగుణంగా కొవిడ్‌ కోసం ఏర్పాటు చేసిన వాహనాన్ని పంపిస్తామన్నారు. సమావేశంలో జిల్లా మేనేజర్‌ శ్రీనివాస్‌, జోనల్‌ మేనేజర్‌ లోకేశ్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T09:59:15+05:30 IST