మమ్మల్నే పరీక్ష చేయించుకోమంటావా?

ABN , First Publish Date - 2020-04-01T07:57:38+05:30 IST

పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థిని కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించిన గ్రామ వలంటీర్‌పై అతని కుటుంబసభ్యులు దాడికి...

మమ్మల్నే పరీక్ష చేయించుకోమంటావా?

  • గుంటూరు జిల్లాలో వలంటీర్‌పై దాడి

దుర్గి, మార్చి 31: పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన విద్యార్థిని కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించిన గ్రామ వలంటీర్‌పై అతని కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం శ్యామరాజపురానికి చెందిన ఓ యువకుడు చెన్నైలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. మంగళవారం స్వగ్రామానికి వచ్చాడు. అతడ్ని కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా వలంటీర్‌ మర్రెబోయిన వెంకటేష్‌ సూచించారు.  దీంతో మమ్మల్నే పరీక్ష చేయించుకోమంటావా అంటూ విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహంతో వలంటీర్‌పై దాడి చేశారు. బాధితుడు దుర్గి ఎస్‌ఐకి, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.


Updated Date - 2020-04-01T07:57:38+05:30 IST