తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-27T08:55:03+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఉచిత స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్ల జారీ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయింది.

తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభం

తిరుమల, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఉచిత స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్ల జారీ సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో గల కౌంటర్లలో రోజుకు మూడు వేల టోకెన్లను ఉదయం 5గంటల నుంచి భక్తులకు అందజేస్తున్నారు.  శ్రీవారి దర్శనానికి సంబంధించి ఒకరోజు ముందు టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, తిరుమల వేంకటేశ్వరస్వామి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల నవంబరు నెల కోటాను మంగళవారం టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది.  

Updated Date - 2020-10-27T08:55:03+05:30 IST