దళితుడు కాబట్టే పోలీసులు అతి చేశారు: అనిత

ABN , First Publish Date - 2020-05-17T22:04:05+05:30 IST

డాక్టర్ సుధాకర్‌ను మానసిక ఆస్పత్రిలో చేర్చించడం దారుణం అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. సుధాకర్ పట్ల పోలీసులు

దళితుడు కాబట్టే పోలీసులు అతి చేశారు: అనిత

విశాఖపట్నం: డాక్టర్ సుధాకర్‌ను మానసిక ఆస్పత్రిలో చేర్చించడం దారుణం అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. సుధాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. సుధాకర్ దళితుడు కాబట్టే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ కుటుంబాన్ని వీధిలో పెట్టారని ప్రభుత్వపై అనిత నిప్పులు చెరిగారు. సుధాకర్‌కు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Updated Date - 2020-05-17T22:04:05+05:30 IST