కెమికల్స్ కారణంగానే సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు?

ABN , First Publish Date - 2020-09-03T20:34:19+05:30 IST

విజయవాడ: సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

కెమికల్స్ కారణంగానే సూరంపల్లి పారిశ్రామికవాడలో పేలుడు?

విజయవాడ: సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తండ్రీకొడుకులు కోటేశ్వరరావు, చిన్నారావు అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి కొడుకు మృతదేహం రేకుల పైన పడింది. తండ్రి మృతదేహం పక్క కంపెనీ వైపునకు ఎగిరి పడింది. ఈ ఘటనపై పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. కెమికల్స్ కారణంగా పేలుడు జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాలను మార్చురీకి తరలించారు. 


ఘటనపై ఫైర్ అధికారి శ్రీనివాసరెడ్డి స్పందన.. 


కెమికల్స్‌తో ఇక్కడ డోర్లు తయారు చేస్తారు. పేలుడు తీవ్రత ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించాం. విచారణ పూర్తి అయితేనే ఏం జరిగందనేది నిర్ధారణ చేయలేము. పేలుడే తప్ప.. మంటలు వ్యాపించలేదు. 


గన్నవరం సీఐ శ్రీనివాసరావు.. 


సమాచారం అందుకున్న‌ వెంటనే మా సిబ్బందితో ఇక్కడకు చేరుకున్నాం. పేలుడు ధాటికి తండ్రి కొడుకులు ఇద్దరూ పైకి ఎగిరి పడ్డారు. వేస్ట్ మెటీరియల్ స్క్రాప్ కోసం కోసం వారు ఇక్కడకు వచ్చారు.క్లూస్ టీంతో అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. నివేదికలు వచ్చాక పేలుడుకు కారణం తెలుస్తుంది. 


నిర్వహకులు జీయస్‌యన్ రెడ్డి.. 

2016 నుంచి ఇక్కడ కంపెనీ నడిపిస్తున్నాం. మా దగ్గర అంత భారీ పేలుడు జరిగే పదార్ధాలు లేవు. స్క్రాప్ కోసం ఈరోజే వాళ్లు ఇక్కడకు వచ్చారు. అక్కడ ఎలా పేలుడు జరిగిందో మాకు తెలియదు. ఆ సమయంలో మేము బయట లోడు వస్తే దింపుతున్నాం. పేలుడు శబ్దం రావడంతో లోపలకి వచ్చాం. అప్పటికే వాళ్లిద్దరూ చనిపోయారు.. ఎలా జరిగిందో విచారణలోనే తెలియాలి.


Updated Date - 2020-09-03T20:34:19+05:30 IST