రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-07T10:06:51+05:30 IST

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

 డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ 

మబగాం(పోలాకి) అక్టోబరు 6: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మంగళవారం మబగాంలో రైతులకు కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, టాటా రేలిస్‌ ఉత్పత్తి చేసిన క్రిమినాశిని మందులను సరఫరా చేయ గా వాటిని కృష్ణదాస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రై తులు వీటిని వినియోగించుకోవాలని కోరారు.  జేడీఏ కె.శ్రీధర్‌, ఏడీఏ రవీంద్రభారతి, సెరీకల్చర్‌ ఏడీ పి.బాలకృష్ణారావు పాల్గొన్నారు. 

Read more