పేదలందరికీ పక్కా ఇళ్లు

ABN , First Publish Date - 2020-12-31T05:22:49+05:30 IST

పేదలందరికీ పక్కా ఇళ్లు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.సాయిరాజ్‌, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా(లల్లూ) తెలిపారు.

పేదలందరికీ పక్కా ఇళ్లు
కవిటి: బొరివంకలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సాయిరాజ్‌

డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాయిరాజ్‌

కవిటి:  పేదలందరికీ పక్కా ఇళ్లు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పి.సాయిరాజ్‌, మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా(లల్లూ) తెలిపారు. బుధవారం మండలంలోని బొరివంక, బీజీపుట్టుగలో ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు పక్కా ఇళ్లు నిర్మించుకొని  సంక్షేమ పథకాలు అనుభవించాల న్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, నాయకులు కె.ప్రకాష్‌, బి.శ్రీరాంప్రసాద్‌ పాల్గొన్నారు.


 కొబ్బరి పార్కు ఏర్పాటుచేయండి

ఇచ్ఛాపురం: కవిటి మండలంలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పార్కు ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌ నివాస్‌కు డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ కోరారు. బుధవారం ఇచ్ఛాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిశారు. కవిటి మండలంలో 25 ఎకరాల్లో రూ.80కోట్లు అంచనా వ్యయంతో చికాప్‌బోర్డు, ముద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రిని కోరినట్లు  కలెక్టర్‌కు తెలియజేశారు. కొబ్బరి ఉత్పత్తుల మార్కెటింగ్‌ సదుపాయానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి కిసాన్‌ రైలు సదుపాయం కల్పించాలని కోరారు. 


క్రీడలతో పోటీతత్వం

కంచిలి:క్రీడలతో పోటీతత్వం పెరుగుతుందని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ తెలిపారు.బుధవారం మఖరాంపురంలో అంతర్రాష్ట్ర క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు టి.చిరంజీవి నాగ్‌ మాట్లాడుతూ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జనవరి 24వ తేదీ వరకు  జరుగుతాయని తెలిపారు. విశ్వశాంతి క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న   కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా, వైసీపీ నేతలు పి.దేవదాసురెడ్డి, ఇప్పిలి కృష్ణారావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-31T05:22:49+05:30 IST