తెరుచుకోనున్న దేవాలయాలు!

ABN , First Publish Date - 2020-05-13T10:51:11+05:30 IST

మూడో విడత లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగుస్తోంది. ఆ తర్వాత ఏరోజైనా ప్రభుత్వ మార్గదర్శకాలకు

తెరుచుకోనున్న దేవాలయాలు!

17 తర్వాత వెసులుబాటు

లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనం

కార్యాచరణ రూపొందించిన అధికారులు


ఒంగోలు (కల్చరల్‌), మే 12: మూడో విడత లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగుస్తోంది. ఆ తర్వాత ఏరోజైనా ప్రభుత్వ మార్గదర్శకాలకు అను గుణంగా దేవాలయాలను తెరిచి భక్తులకు దర్శనం కల్పించేందుకు జిల్లా దేవదాయశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. లాక్‌ డౌన్‌ ప్రారంభం నుంచి జిల్లా వ్యాప్తంగా పెద్ద, చిన్న దేవాలయాలను మూ సివేశారు. కేవలం ఆయా ఆలయాల అర్చకులు అంతరాలయంలో ముఖ్య మైన సేవలను మాత్రమే నిర్వహిస్తున్నారు. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమేపీ కొన్ని రంగాలకు సడలింపులు ఇస్తు న్న దృష్ట్యా దేవాలయాలను తెరిచేందుకు అనుమతి లభిస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై దేవదాయశాఖ కమిషనర్‌ చంద్రమోహ న్‌, అదనపు కమిషనర్‌ టి.చంద్రకుమార్‌, జాయింట్‌ కమిషనర్‌ ఆజాద్‌లు మంగళవారం వీడియో కాన్ఫరెన్ఫ్‌ ద్వారా జిల్లా సహాయ కమిషనర్లతో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్ఫ్‌లో మన జిల్లా సహాయ కమిషనర్‌ జి.మాధవి  పలు సూచనలు చేసినట్లు సమాచారం.  జిల్లాలోని 6(ఏ), 6(బి) దేవస్థా నాలలో భక్తులకు దర్శనం కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సహా య కమిషనర్‌కు ఆయా దేవాలయాల కార్యనిర్వహణాధికారులు సమర్పిం చారు.  భక్తులకు తగిన భౌతిక దూరం పాటిస్తూ క్యూలైన్ల ఏర్పాటు, ప్రతి గంటకు ఒకసారి సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో ఆలయం శుభ్ర పర చడం, ప్రవేశద్వారం దగ్గర శానిటైజర్‌లు అందుబాటులో ఉంచనున్నారు. 


ప్రసిద్ధ దేవాలయాలైన సింగరకొండ ప్రసన్నఆంజనేయ స్వామి దేవ స్థానం, మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, భైరవకోన భైర వేశ్వర స్వామి దేవస్థానం, మరికొన్ని దేవాలయాల వద్ద డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నె ల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే, భక్తులకు శఠారి ఇవ్వటం, అంతరాలయంలోకి ప్రవేశించటం మాత్రం నిషేధం.  ఇక జిల్లా వ్యాప్తంగా దేవదాయశాఖ సిబ్బంది విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుం టున్నారు. 

Read more