నారాయణ స్వామి ఆలయంలో పూజలు

ABN , First Publish Date - 2020-12-14T04:35:00+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారా యణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి.

నారాయణ స్వామి ఆలయంలో పూజలు
మహానైవేద్యంతో ప్రదక్షిణ చేస్తున్న భక్తులు


సీఎస్‌పురం, డిసెంబరు 13 : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారా యణ స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు  జరిగాయి. అర్చ కులు ఎం.సత్యన్నారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృ తాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి హారతులు, గోపూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మహానైవేద్యంతో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి సమ ర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.నవీన్‌కుమార్‌, దేవస్థాన  చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం భక్తుల కు అన్నదానం నిర్వహించారు.


Updated Date - 2020-12-14T04:35:00+05:30 IST