మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2020-11-22T05:16:33+05:30 IST

మ త్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భాస్కర్‌


కలెక్టర్‌  పోలా భాస్కర్‌ 


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 21 : మ త్స్యకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నదని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ప్రపంచ మత్య్సకారుల ది నోత్సవం సందర్భంగా శనివారం సీఎం జగ న్మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించా రు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తప ట్నం మండలంలో ఫిషింగ్‌హార్బర్‌ మంజూ రైందని, త్వరలో శంకుస్థాపన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మా దాశి వెంకయ్య, ఇన్‌చార్జి జేసీ కృష్ణవేణి, వివిధ శాఖల అధికారులు చంద్రశేఖర్‌రెడ్డి, వి.రఘునాథ్‌బాబు, లక్ష్మానాయక్‌, రవి, మ త్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వాయల సుమతి పాల్గొన్నారు. అనంతరం 22 మందికి రూ. 4.40 లక్షల రుణాలు అందజేశారు. లబ్ధిదారుల ఎంపిక 


వచ్చే ఏడాది జనవరి నుంచి రేషన్‌కా ర్డుదాలందరికీ ఇంటి వద్దకే సరుకులు పంపి ణీ జరిగేలా వాహనాలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. వాహ నాల ఎంపిక ప్రక్రియపై శనివారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి ఎంపీడీవోలతో వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ పై వాహనలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 511, పట్టణ ప్రాంతాలకు 78 వాహనాలను కేటాయించిన ట్లు చెప్పారు. ఆయా కార్పొరేషన్ల వాహనాల లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ టీఎస్‌చేత న్‌, వివిధ శాఖల అధికారులు కైలాష్‌గిరీశ్వర్‌, సురేష్‌, గ్లోరియా తదితరులు పాల్గొన్నారు.


Read more