దర్శిలో వీఆర్వోల మూకుమ్మడి సెలవు

ABN , First Publish Date - 2020-02-08T11:13:12+05:30 IST

మండలంలోని వీఆర్వోలు శుక్రవారం మూకుమ్మడిగా సెలవు పెట్టారు. పని ఒత్తి డి, తహసీల్దార్‌ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణ యం

దర్శిలో వీఆర్వోల మూకుమ్మడి సెలవు

పని ఒత్తిడి, తహసీల్దార్‌ వ్యవహారశైలే కారణం

కందుకూరు ఆర్డీవోను కలిసి  ఫిర్యాదు 

దర్శి, ఫిబ్రవరి 7 : మండలంలోని వీఆర్వోలు శుక్రవారం మూకుమ్మడిగా సెలవు పెట్టారు. పని ఒత్తి డి, తహసీల్దార్‌ వ్యవహార శైలికి నిరసనగా ఈ నిర్ణ యం తీసుకున్నట్లు వారు తెలిపారు. దర్శి డీప్యూటీ తహసీల్దార్‌ దేవిప్రసాద్‌కు వీరంతా సెలవు పత్రాలు అందజేశారు. తహసీల్దార్‌ అశోక్‌వర్థన్‌ కొద్దిసేపటిలో కార్యాలయానికి వస్తారని డీటీ చెప్పినా వీఆర్వోలు వినలేదు. డిప్యూటీ తహసీల్దార్‌కే సెలవు పత్రాలు అందించి  కందుకూరు  వెళ్లారు. అక్కడ ఆర్డీవోను కలి సి అధికారులపై ఫిర్యాదు చేశారు. మండలంలో 18 మంది వీఆర్వోలు ఉండగా ఒకరు వ్యక్తిగత పనులపై కొద్దిరోజుల క్రితం సెలవు పెట్టారు. మిగిలిన 17 మం ది శుక్రవారం మూకుమ్మడి సెలవు పెట్టారు. ఈ సందర్భంగా వీఆర్వోల యూనియన్‌ నాయకుడు రంగారావు మాట్లాడుతూ రాత్రిపగలు తేడాలేకుండా తమతో పనిచేయిస్తూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. అంతేగాక తహసీల్దార్‌ దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. 

నాకు ఎలాంటి సమాచారం లేదు

 మండలంలోని వీఆర్వోలు మూకుమ్మడిగా సెలవు పెడుతున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం వారు గ్రామ సచివాలయాల్లో ఎంపీడీవోల పర్యవేక్షణలో పని చేయాల్సి ఉంది. అందువలన ఏదై నా సమస్య ఉంటే ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లాలి. కనీ సం నన్ను సంప్రదించినా చర్చించి సమస్య పరిష్కరానికి కృషి చేసే వీలుండేది. 


Updated Date - 2020-02-08T11:13:12+05:30 IST