సేవే దేవోభవ

ABN , First Publish Date - 2020-04-01T10:02:48+05:30 IST

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ షేక్‌ రియాజ్‌ నేతృత్వంలో స్థానిక లాయర్‌పేట విశ్వసేవిక

సేవే దేవోభవ

వెల్లువెత్తున్న సాయం.. ముందుకొస్తున్న దాతలు, స్వచ్ఛంద సంస్థలు

పేదలకు, అనాథలకు ఆహారం పంపిణీ

కూరగాయలు, మాస్కులు అందజేత

250 కుటుంబాలకు కూరగాయల పంపిణీ


ఒంగోలు (కల్చరల్‌), , మార్చి 31 : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంట్‌ ఇంచార్జ్‌ షేక్‌ రియాజ్‌ నేతృత్వంలో స్థానిక లాయర్‌పేట విశ్వసేవిక ట్రస్ట్‌ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మంగళవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు.  బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం 150 సబ్బులను, 150 మజ్జిగ పాకెట్లను అందజేశారు. సీపీఎం బండ్లమిట్ట జోన్‌ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యతా నగర్‌ చెరువుకట్ట మీద నివాసం ఉంటున్న వందమంది పేదలకు, బుడబుక్కల వారికి ఆ పార్టీ నాయకులు మారెళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో కూరగాయలు, బిస్కెట్లను పంపిణీ చేశారు.  మరోవైపు ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంజయ్‌గాంధీ కాలనీలో 200 శానిటైజర్లు, 1000 మాస్కులను అందజేశారు. 


ఆంధ్రజ్యోతి సిబ్బందికి శానిటైజర్ల అందజేత

 ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బంది, పాత్రికేయులకు మంగళవారం ప్రముఖ చర్మవ్యాధుల వైద్యురాలు డాక్టర్‌ రోహిణీ పూర్ణిమ శానిటైజర్లను అందజేశారు.  నవయుగ ఫౌండేషన్‌ సహకారంతో వీటిని పంపిణీ చేసినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి జిల్లా బ్రాంచి మేనేజర్‌ ఐవీ సుబ్బారావు, ఫౌండేషన్‌ అధ్యక్షుడు కొమ్మినేని మస్తాన్‌ చౌదరి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఫౌండేషన్‌ అధ్యక్షుడు మస్తాన్‌ చౌదరిని ఈ సందర్భంగా బ్రాంచి మేనేజర్‌ ఐవీ సుబ్బారావు అభినందించారు. 


సీఎస్‌పురం :  అయ్యలూరివారిపల్లి గ్రామానికి చెందిన  వ్యాపారవేత్త, వైసీపీ నాయకుడు ముత్యాల నారాయణరెడ్డి అయ్యలూరివారిపల్లి పంచాయతీలోని అయ్యలూరివారిపల్లి, జినుగువారిపల్లి 250 కుటుంబాలకు మంగళవారం కూరగాయలు పంపిణీ చేసారు. అలాగే  సీఎస్‌పురంలో నిలిచిపోయిన వలస కూలీలకు, అనాథలకు, యాచకులకు స్థానిక కస్తూర్బా బాలికల పాఠశాలలో ప్రభుత్వం తరుపున మండల అధికారులు మంగళవారం నుంచి భోజనాలు ఏర్పాటు చేశారు. 


 పీసీపల్లి : చింతలపాలెం గ్రామంలో 100 కుటుంబాలకు శానిటైజర్లు, కూరగాయాలు, మాస్కులు, గ్లౌజులను వైసీపీ యూత్‌ నాయకులు చెరుకూరి సతీష్‌ మంగళవారం అందజేశారు. 


చీరాల :   టూటౌన్‌ సీఐ ఫిరోజ్‌ అనాథలకు పులిహోర, పెరుగన్నం పొట్లాలను పంపిణీ చేశారు. ఈపురుపాలెం తేజ స్కూల్‌ నిర్వహకులు శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు మాస్క్‌లు, శానిటైజర్లు, డ్రైఫ్రూట్స్‌ అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు నిత్యావసరసరుకులు పంపిణీ చేశారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ చీరాల వారి ఆధ్వర్యంలో పేదలకు ఆహారపొట్లాలను వన్‌టౌన్‌ సీఐ నాగమల్లేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. 


మద్దిపాడు: సీతారామపురం కొస్టాలు వద్ద ప్రముఖ వ్యాపారవేత్త మండవ బాలచంద్రమౌళి మంగళవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బీసీ, ఎస్సీ కాలనీల్లో నివసిస్తున్న పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులను  ఎస్సై షేక్‌ ఖాదర్‌భాషా చేతులమీదుగా అందజేశారు.


బల్లికురవ: హనుమాన్‌ ఎక్స్‌పోర్టు క్వారీ యజమానులు మంగళవారం కొత్తమల్లాయపాలెం గ్రామస్థులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి అయిదు కేజీల చొప్పున కూరగాయలను క్వారీ యజమాని పొత్తురి వెంకట్రావు తదితరులు అందజేశారు. 


Updated Date - 2020-04-01T10:02:48+05:30 IST