రైతులు, కూలీలకు పాసులు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-05-17T10:56:38+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు ప్రభుత్వం మరిన్ని మినహాయింపులు కల్పించింది.

రైతులు, కూలీలకు పాసులు తప్పనిసరి

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు ప్రభుత్వం మరిన్ని మినహాయింపులు కల్పించింది. అయితే వ్యవసాయ, ఉద్యాన కార్యకలాపాలకు హాజరయ్యే రైతులు, కూలీలు విధిగా మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల నుంచి పాసులు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈమేరకు శనివారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, రిటైల్‌ అమ్మకాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అమ్మకం, యంత్రపరికరాలకు మినహాయింపులు ఇచ్చింది. అయితే ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకే వీటికి అనుమతిస్తోంది. కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల మండలాల్లో పండ్లు, కూరగాయల మార్కెట్లకు 24/7 అనుమతులు ఇచ్చారు. 

Updated Date - 2020-05-17T10:56:38+05:30 IST