కలిసి కట్టుగా.. కడుపు నిండగా....!

ABN , First Publish Date - 2020-04-26T10:34:41+05:30 IST

చేయి చేయి కలుపుదాం..... పేదలకు ఆపన్న హస్తం అందిద్దాం... అంటూ దాతలంతా ఏకమై తమ దాతృత్వాన్ని చూపుతున్నారు.

కలిసి కట్టుగా.. కడుపు నిండగా....!

నెల్లూరు రూరల్‌, ఏప్రిల్‌ 25 : చేయి చేయి కలుపుదాం..... పేదలకు ఆపన్న హస్తం అందిద్దాం... అంటూ దాతలంతా ఏకమై తమ దాతృత్వాన్ని చూపుతున్నారు. నెల్లూరులోని చింతారెడ్డిపాళెంలో ఎస్సీ కాలనీలోని పేదలకు ఏఎంసీ చైర్మన్‌ ఏసునాయుడు, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డిలు వంటనూనె, 13 రకాల కూరగాయలు, ఊరగాయలు, పండ్లు అందించారు. సౌత్‌రాజుపాళెంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైసీపీ ఇన్‌చార్జి గిరిధర్‌రెడ్డిలు పేదలకు కూరగాయలు అందించారు. ఎన్టీఆర్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో గణేష్‌ సేవా మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంచింది. కొత్తూరు వద్దనున్న హెచ్‌కే బాబుకాలనీలో విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు ఆహార ప్యాకెట్లు అందించారు. 


21, 22, 31, 34 డివిజన్లలో సీపీఎం నాయకులు ఆహారం, బియ్యం, నిత్యవసరాలతోపాటు కూరగాయలు అందించారు. 42, 48 డివిజన్లలో పారిశుధ్య కార్మికులకు బీజేపీ నాయకుడు యశ్వంత్‌సింగ్‌ మాస్కులు అందించారు. పేద బ్రాహ్మణులు శీకంఠం రమణయ్య, ఆమంచర్ల వెంకట ప్రభాకర్‌లు దక్షిణ సింహపురి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కల్లూరిపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద బియ్యం, పప్పు దినుసులు పంపిణీ చేశారు. 36వ డివిజన్‌లో పేదలకు మదన్‌మోహన్‌రెడ్డి కూరగాయలు అందించారు.  విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో పనిచేస్తున్న కార్మికులకు యూనైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్క్స యూనియన్‌ నాయకులు శానిటైజర్లు, మాస్కులు అందించారు. 39వ డివిజన్‌ టీడీపీ నాయకులు శశిధర్‌ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఆహారం, పండ్లు అందించారు. కల్లూరుపల్లిలోని గిరిజన, సర్కస్‌ కుటుంబాలకు ఉదయం న్యూస్‌ ప్రతినిధి పౌష్టికాహార అందించగా, ఫత్తేఖాన్‌పేట మిత్ర మండలి ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. 


కోవూరు మండలం ఇనమడుగు అట్లకాలనీలో పడుగుపాడు సొసైటీ సీఈవో గోవర్ధన్‌రెడ్డి, సహకార బ్యాంకు మేనేజర్‌ సుధాకర్‌, సీడీసీ మాజీ చైర్మన్‌ జక్కంరెడ్డి కృష్ణారెడ్డిలు ఆహార ప్యాకెట్లు అందించారు. కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు పదలకు కూరగాయలు, గుడ్లు అందించారు. టీడీపీ నాయకులు నిత్యవసరాలను సమకూర్చారు. బుచ్చి, జొన్నవాడ ప్రాంతాలలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు కూరగాయలు, గుడ్లు అందించారు. పారిశుధ్య కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


మనుబోలు మండలంలోని 6 గ్రామాలు, టీపీగూడూరులోని 8 గ్రామాలలో రైతన్న కానుకను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పిలుపుతో వెంకటాచలం మండలం ఎగువమిట్ట గ్రామాలలో టీడీపీ నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు. బుచ్చిలోని రాయలసీమ కాలనీ పేదలకు వివేకానంద స్కూల్‌ పూర్వ విద్యార్థులు తహసీల్దారు ఫషీమాలిక్‌ ద్వారా ఆహార ప్యాకెట్లు అందించారు. 


కోట మండలం కొత్తపట్నంలో బీటీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసరాలను అందించారు. గూడూరులోని ప్రజా అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు ఆహార ప్యాకెట్లు అందించగా, కృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు పేదలకు కూరగాయలు పంచారు. కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ద్వారా విశ్వోదయ విద్యా సంస్థల రెక్టార్‌ దొడ్ల వినయ్‌కుమార్‌రెడ్డి 2 వేల శానిటైజర్లను డీఎస్పీ ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు అందించారు. వైసీపీ నాయకుడు గంగినేని వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ద్వారా 26వ వార్డు పేదలకు బియ్యం, నిత్యావసరాలు అందించారు. జేడీ ఫౌండేషన్‌ ప్రతినిధి అరుణ పేదలకు ఆహార ప్యాకెట్లు అందించారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో పేదలకు ఆహారం సమకూర్చారు.  


చేజర్ల మండలం తూర్పు కంభంపాడులో మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు, చేజర్లలో వైసీపీ నాయకుడు విజయ భాస్కర్‌రెడ్డి పారిశుధ్య కార్మికులకు కూరగాయలు అందించారు. అభిరామ్‌ హెల్డ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మకూరులోని 21వ వార్డులోని పేదలకు డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు ద్వారా నిత్యావసరాలు అందించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


నాయుడుపేటలో 786 సేవా సంఘాల అధ్యక్షుడు రఫీ, మున్సిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి  పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. భీమవరంలో పోతిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి పేదలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. బాలాయపల్లి మండలం కరిమేనగుంటలో వైసీపీ నాయకులు గిరిజనులకు బియ్యం, బోగోలు మండలం విశ్వనాథరావుపేట పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నూరుధీన్‌ పౌష్టికాహారం అందించారు. సీతారామపురం మండలంలోని నారాయనప్పపేట, పండ్రంగి గ్రామాలలో స్థానిక యూత్‌ మస్తాన్‌వళి  పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. అల్లూరులో యూటీఎఫ్‌ నాయకులు పేదలకు నిత్యసరాలను అందించారు. 


అనంతసాగరం మండలం గౌరవరంలో పేదలకు శాఖమూరి సుబ్బారావు, శీను, సుబ్రహ్మణ్యంలు నిత్యావసర సరుకులను అందించారు. అనంతసాగరం మండలం సోమశిలలో గిరిజనులకు కేఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలను అందించారు. రాపూరులో కుష్ఠు రోగులకు అన్నదానం చేశారు. 

Updated Date - 2020-04-26T10:34:41+05:30 IST