నేటి నుంచి రైల్వేగేట్‌ మూసివేత

ABN , First Publish Date - 2020-11-22T04:44:09+05:30 IST

స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న రైల్వేగేట్‌ను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మూసివేస్తున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి రైల్వేగేట్‌ మూసివేత

సూళ్లూరుపేట, నవంబరు 21 : స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న రైల్వేగేట్‌ను ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మూసివేస్తున్నట్టు దక్షిణ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం గేటును మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు తహసీల్దారు,  పోలీస్‌ అధికారులకు సమాచారం అందజేశారు.

Read more