ఉద్యమం ఉధృతం

ABN , First Publish Date - 2020-11-16T02:04:49+05:30 IST

మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని జిల్లా సాధన సమితి, జనవిజ్ఞానవేదిక నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

ఉద్యమం ఉధృతం
ఉదయగిరి జిల్లా చేయాలని గోడలపై రాతలు రాస్తున్న యువకుడు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 15: మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని జిల్లా సాధన సమితి, జనవిజ్ఞానవేదిక నాయకులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉదయగిరిని జిల్లా చేయాలని, మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లా సాధనతోనే విద్యా, వైద్యం, రహదారులు బాగు పడతాయని నినాదాలతో కూడిన రాతలను గోడలపైకెక్కిచి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. ఉదయగిరి మండలంలో మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, దుత్తలూరు మండలంలో మాజీ ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు సహకారంతో అన్ని గ్రామాల్లో గోడలపై రాతలు రాస్తూ ప్రజలను చైతన్య వంతం చేస్తున్నారు.

Updated Date - 2020-11-16T02:04:49+05:30 IST