వాహనం ఢీకొని భార్యాభర్తలకు తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2020-11-22T04:24:26+05:30 IST

నెల్లూరు-ముంబాయి జాతీయ రహదారిపై మర్రిపాడు మండ లం కదిరినాయుడుపల్లి గ్రామ సమీపంలో శనివారం గుర్తుతెలి

వాహనం ఢీకొని భార్యాభర్తలకు తీవ్రగాయాలు

మర్రిపాడు, నవంబరు 21: నెల్లూరు-ముంబాయి జాతీయ రహదారిపై మర్రిపాడు మండ లం కదిరినాయుడుపల్లి గ్రామ సమీపంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని భార్యా భర్తలకు తీవ్రగాయాలయ్యాయి. కడప జిల్లా బద్వేలు మండలం బయ్యన్నవారిపల్లి గ్రామానికి చెందిన మాధవ, మహేశ్వరి దంపతులు మోటారుసైకిల్‌పై మర్రిపాడు మండలం పొంగూరు నుంచి బద్వేలు వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఢీకొన్న వాహనం లారీగా అనుమానిస్తున్నారు. రహదారిపై వెళ్లే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వీర నారాయణ ఘటనా స్థలిని పరిశీలించి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read more