సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2020-04-28T13:47:24+05:30 IST

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ

అమరావతి: లాక్‌డౌన్‌తో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలంటూ సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. మిర్చి విక్రయానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. కరోనాతో పెట్టుబడి ఖర్చు అదనమైందని ఎమ్మెల్యే తెలిపారు. చైనాలో దిగుబడి తగ్గడంతో మన మిరపకు అధిక డిమాండ్ ఉందన్నారు. కోత, ఎండబెట్టడం, తరలింపునకు అవకాశం ఇవ్వాలని... శాటిలైట్ మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2020-04-28T13:47:24+05:30 IST