కత్తి పద్మారావుకు ‘లోక్‌నాయక్‌’ పురస్కారం

ABN , First Publish Date - 2020-11-25T09:35:27+05:30 IST

లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ దళిత రచయిత, సాహితీవేత్త కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మంగళవారమిక్కడ తెలిపారు

కత్తి పద్మారావుకు ‘లోక్‌నాయక్‌’ పురస్కారం

బీచ్‌రోడ్డు (విశాఖపట్నం), నవంబరు 24: లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ దళిత రచయిత, సాహితీవేత్త కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మంగళవారమిక్కడ తెలిపారు. ఏటా జనవరిలో ఎన్టీఆర్‌ వర్ధంతి రోజున పురస్కార ప్రదాన కార్యక్రమం ఉండేదని, అయితే కరోనా నేపథ్యంలో ఈ సారి అంబేడ్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14న విశాఖ వేదికగా నిర్వహిస్తామన్నారు.


Read more