పంట ఉత్పత్తులను భద్రపర్చుకోవాలి

ABN , First Publish Date - 2020-11-26T05:58:43+05:30 IST

రైతులు పంట ఉత్పత్తులను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, మార్కెట్‌లో ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని గిడ్డంగుల అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ శ్యాంకుమార్‌ సూచిం చారు.

పంట ఉత్పత్తులను భద్రపర్చుకోవాలి

  1.   గిడ్డంగుల అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 25: రైతులు పంట ఉత్పత్తులను గిడ్డంగుల్లో భద్రపర్చుకోవాలని, మార్కెట్‌లో ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని గిడ్డంగుల అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్‌ శ్యాంకుమార్‌ సూచిం చారు. బుధవారం కల్లూరు ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను ప్రకటించిందని, అయితే ఈ పంట ఉత్పత్తులకు సరైన ధర అందుకోవాలంటే నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కల్లూరు సొసైటీ ప్రెసిడెంట్‌ శివశంకర్‌ రెడ్డి, సీఈవో పుల్లయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-26T05:58:43+05:30 IST