జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-20T06:08:06+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో రుద్రవరం ఉన్నత పాఠశాలను డీఈవో సాయిరాం శనివారం తనిఖీ చేశారు.

జాగ్రత్తగా ఉండాలి
ఉపాధ్యాయులు, అధికారులతో సమావేశమైన డీఈవో సాయిరాం

  1. హెచ్‌ఎంలు, యాజమాన్యాలకు డీఈవో ఆదేశం
  2. రుద్రవరం ఉన్నత పాఠశాల సందర్శన


రుద్రవరం, డిసెంబరు 19: కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో రుద్రవరం ఉన్నత పాఠశాలను డీఈవో సాయిరాం శనివారం తనిఖీ చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశిం చారు. పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచిం చారు. రుద్రవరంలో 149 మంది విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, 14 మందికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 8 మంది ఉపాధ్యాయులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిం చామని, అందరికీ నెగిటివ్‌ వచ్చిందని అన్నారు. అనంతరం ఆయన వైద్యులు, ఇన్‌చార్జి ఎంపీడీవో, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చిన వారు బయట తిరగకుండా చూడాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తరచూ ఉపాధ్యాయులు వారితో మాట్లాడాలని ఆదేశించారు. 


కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా..

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆటోల్లో పాఠశాలలకు రావడానికి ఇబ్బంది ఉన్నమాట వాస్తవమేనని డీఈవో అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వీరపాండియన్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులను పాఠశాలలకు చేరవేసే ఆటో డ్రైవర్లకు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. 


226 మందికి కొవిడ్‌ పరీక్షలు 

రుద్రవరంలో శనివారం 226 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు రెడ్డి కిషోర్‌, గాయత్రి తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులను కలిసినవారందరికీ కొవిడ్‌ పరీక్షలు చేశామని తెలిపారు. ఇంటింటికి తిరిగి వారి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించామని వెల్లడించారు. పాజిటివ్‌ వచ్చిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు బయట తిరగవద్దని సూచించారు.  


Updated Date - 2020-12-20T06:08:06+05:30 IST