తిరుపతి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం

ABN , First Publish Date - 2020-11-26T04:54:49+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్టానం త్వరలో ప్రకటిస్తుందని, తిరుపతి గెలుపుతో రాష్ట్రంలో, దేశంలో పార్టీకి పునర్వవైభవం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

తిరుపతి అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

కడప(కలెక్టరేట్‌), నవంబరు 25: తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిని కాంగ్రెస్‌ అధిష్టానం త్వరలో ప్రకటిస్తుందని, తిరుపతి గెలుపుతో రాష్ట్రంలో, దేశంలో పార్టీకి పునర్వవైభవం వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు అధ్యక్షతన ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ కంచుకోటని, 1952 నుంచి నేటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌ 12 సార్లు గెలిచిందన్నారు. దీన్నిబట్టి చూస్తే పార్టీని తిరుపతి లోక్‌సభ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలని, ఆ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు విష్ణుఫ్రీతంరెడ్డి, కడప పార్లమెంట్‌ ఇంఛార్జి గుండ్లకుంట శ్రీరాములు, ధృశకుమార్‌ రెడ్డి, సిరాజుధ్దీన్‌, లక్ష్ముయ్య, తిరుమలేశు, శ్రీనివాసులు, మల్లికా బేగం, కుళ్లాయప్ప. నరసింహులు లావణ్య తధితరులు పాల్గొన్నారు.

Read more