డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-11-22T04:44:56+05:30 IST

డీఎస్పీ కా ర్యాలయం వద్ద శనివారం ము ద్దనూరు మం డలం చింతకుంట గ్రామానికి చెందిన వీరారెడ్డి, నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు.

డీఎస్పీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
బాధితులను తీసుకెళుతున్న పోలీసులు

జమ్మలమడుగు రూరల్‌/ ముద్దనూరు, నవంబరు 21: జమ్మలమడు గు డీఎస్పీ కా ర్యాలయం వద్ద శనివారం ము ద్దనూరు మం డలం చింతకుంట గ్రామానికి చెందిన వీరారెడ్డి, నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. చింతకుంటలో 1.70 సెంట్లు పొలం వివాదాస్పదంగా మారింది. భాగ పరిష్కారాల విషయంలో దాయాదులైన వీరారెడ్డి, నారాయణరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు సమస్యను పరిష్కరించుకోవడంలో ముద్దనూరు పోలీసుస్టేషనకు వెళ్లినట్లు తెలిపారు. రెండుసార్లు స్టేషనకు వెళ్లినా తమకు న్యాయం జరగలేదని వీరారెడ్డి కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయమై ఈనెల 19వ తేదీ రాజగోపాల్‌రెడ్డి వర్గీయులు బెదిరిస్తున్నా పోలీసులు మాత్రం తమకు న్యాయం చేయలేదని బాధితులు ఆరోపించారు. అధికారులు స్పందించకపోవడంతో శనివారం ఉదయం బాధిత కుటుంబం జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయంలో విషరసాయనం తెచ్చుకుని ఆత్మహత్యాప్రయత్నం చేసుకుంటుండగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని కౌన్సెలింగ్‌ చేసి డీఎస్పీ నాగరాజు వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయంపై డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ ముద్దనూరులో పోలీసులు నిర్లక్ష్యం చేశారని బాధితులు ఆరోపించారన్నారు.  బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

భూమిని పరిశీలించిన డీఎస్పీ: బాధితుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ చింతకుంట గ్రామానికి వెళ్లి తగాదా ఉన్న భూమిని పరిశీలించారు. అలాగే గ్రామంలోకి వెళ్లి ప్రజల ద్వారా సమస్యపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో సీఐ హరినాథ్‌, ఎస్‌ఐ శంకర్‌రావు పాల్గొన్నారు.

కేసు నమోదు : భూతగాదా విషయమై శనివారం ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకర్‌రావు తెలిపారు. నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more