డైట్‌ అధ్యాపకుడిపై పోక్సో కేసు

ABN , First Publish Date - 2020-03-02T10:10:55+05:30 IST

రాయచోటి డైట్‌ విద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న గిరిబాబుపై రాయచోటి అర్బన్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు

డైట్‌ అధ్యాపకుడిపై పోక్సో కేసు

రాయచోటి, మార్చి 1: రాయచోటి డైట్‌ విద్యాలయంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న గిరిబాబుపై రాయచోటి అర్బన్‌ పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఐ రాజు కథనం మేరకు... డైట్‌లో అధ్యాపకునిగా, హాస్టల్‌ ఇన్‌ చార్జిగా పనిచేస్తున్న గిరిబాబు డైట్‌ విద్యా ర్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఫోన్‌ ద్వారా వాళ్లను వేధింపులకు గురి చేశాడు. ఈ మేరకు ఓ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో ఇతనిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Updated Date - 2020-03-02T10:10:55+05:30 IST