ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి : పుత్తా

ABN , First Publish Date - 2020-12-20T04:57:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమబలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి : పుత్తా
సమావేశంలో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి

కమలాపురం, డిసెంబరు 19: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కమబలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం కమలాపురం మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానాలను ఎండగట్టేందుకు జనవరిలో నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగ సభను నిర్వహించి ప్రజలకు అంతా తెలియజేస్తామన్నారు. 

Read more