జడ్జి రామకృష్ణకు తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-09-01T21:59:28+05:30 IST

జడ్జి రామకృష్ణ ఇంటి నుంచి బయటికి రాకుండా..తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

జడ్జి రామకృష్ణకు తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసిన హైకోర్టు

చిత్తూరు జిల్లా: జడ్జి రామకృష్ణ ఇంటి నుంచి బయటికి రాకుండా..తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు 10 రోజుల పాటు సస్పెండ్ చేసింది. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలు న్యాయ, చట్టవిరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. రామకృష్ణను ఇంట్లో నుంచి బయటికి రావద్దంటూ.. అక్కడి తాహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై రామకృష్ణ తరఫు న్యాయవాది శ్రావణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 


దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఒక జడ్జిని ఇంట్లోనుంచి బయటకు రావద్దని ఎలా ఆదేశాలు ఇస్తారని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, భావప్రకటన స్వేచ్ఛను కూడా అడ్డుకున్నట్లు అవుతుందని రామకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను ఈ మేరకు సస్పెండ్ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశిస్తూ.. 10 రోజుల తర్వాత వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2020-09-01T21:59:28+05:30 IST