పేద బ్రాహ్మణులను ఆదుకోండి: సాధినేని

ABN , First Publish Date - 2020-04-26T10:02:06+05:30 IST

పూట గడవక, బయట చేయి చాచలేక కాలం వెళ్లదీస్తున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని రాష్ర్టీయ ..

పేద బ్రాహ్మణులను ఆదుకోండి: సాధినేని

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): పూట గడవక, బయట చేయి చాచలేక కాలం వెళ్లదీస్తున్న పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని రాష్ర్టీయ బ్రాహ్మణ ఫ్రంట్‌ జాతీయ మహిళా అధ్యక్షురాలు సాధినేని యామిని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అర్చకులకు సాయం చేస్తోందని, అర్చకులతో పాటు పేద బ్రాహ్మణులకు సాయం చేయాలని కోరారు. వంట పనులు, ఇతర చిన్నా చితక పనులు చేసుకుని జీవించే బ్రాహ్మణులు లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

Updated Date - 2020-04-26T10:02:06+05:30 IST