కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో సర్వే

ABN , First Publish Date - 2020-04-28T09:50:52+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు

కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో సర్వే

ప్రజలు సహకరించాలి  కమిషనర్‌ అనురాధ 


గుంటూరు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 27: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. మెడికల్‌ ఆఫీసర్స్‌కి ప్రజలు సహకారం అందించాలన్నారు. సోమవారం ఆమె ఆనందపేటలోని కంట్రోల్‌ రూమ్‌, యానాదికాలనీలలో పర్యటించి సర్వేని తనిఖీ చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇళ్ళ నుంచి బయటకు రాకూడదని సూచించారు. పర్యటనలో ఎంహెచ్‌వో శ్రీదేవి, ఈఈ శాంతిరాజు, డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, సెక్రటరీలు, వాలంటీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-28T09:50:52+05:30 IST