25న లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల అప్పగింత

ABN , First Publish Date - 2020-12-19T06:15:32+05:30 IST

పట్టణంలోని ఎర్రచెరువులో నిర్మించిన టిడ్కో ఇళ్లను 1728 మంది లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

25న లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల అప్పగింత

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి, డిసెంబరు 18: పట్టణంలోని ఎర్రచెరువులో నిర్మించిన టిడ్కో ఇళ్లను 1728 మంది లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.  రాజీవ్‌ గృహకల్ప రోడ్డులోని ఎర్రచెరువులో నిర్మించిన టిడ్కో ఇళ్లను శుక్రవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ హేమమాలిని, ఏఈ రమే్‌షలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇళ్లను పరిశుభ్రం  చేసి, అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.  300 చదరపు అడుగుల ప్లాటును రూపాయికే రిజిస్ట్రేషన్‌చేసి  లబ్ధిదారులకు ఇవ్వనున్నామని, 365, 430 చదరపు అడుగుల ప్లాటుకు లబ్ధిదారులకు భారం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోనుందని చెప్పారు. 1728 ఇళ్లను  ఈ నెల 25వ తేదీన పంపిణీ ప్రారంభించి 14రోజుల పాటు ప్రతిరోజూ 125 మందికి రిజిస్ట్రేషన్లు చేసి  ఇంటి పత్రాలు అందిస్తామన్నారు. 


Read more