అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-12-19T05:46:11+05:30 IST

శ్యామలానగర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం నుంచి నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శుక్రవారం మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నంతో కలిసి ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే గిరిధర్‌ తదితరులు

గుంటూరు, డిసెంబరు 18: శ్యామలానగర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం నుంచి నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శుక్రవారం మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నంతో కలిసి ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ శంకుస్థాపన చేశారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, మద్య విమోచన ప్రచార కమిటీ చైౖర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, వైసీపీ నాయకులు టీఎల్‌వీ వీరాంజనేయులు, మేరిగ విజయలక్ష్మి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read more