డ్రెయిన్లపై ఆక్రమణలు తొలగించాలి

ABN , First Publish Date - 2020-07-18T10:05:13+05:30 IST

నగరంలోని డ్రెయిన్లపై ఆక్రమణలను తొలగించాలని గుంటూరు నగర కమిషనర్‌ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.

డ్రెయిన్లపై ఆక్రమణలు తొలగించాలి

గుటూరు నగర కమిషనర్‌ అనురాధ


గుంటూరు (కార్పొరేషన్‌), జూలై 17: నగరంలోని డ్రెయిన్లపై ఆక్రమణలను తొలగించాలని గుంటూరు నగర కమిషనర్‌ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. స్థానిక బాలాజీనగర్‌లోని కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో శుక్రవారం ఆమె పర్యటించారు. కంటైన్మెంట్‌ పరిధి నుంచి ప్రజలు బయటకు రాకుండా చూడాలన్నారు.  డిస్‌ఇన్ఫెక్షన్‌ పనులు ముమ్మరంగా చేయాలన్నారు. ఎన్విరాన్‌ మెంట్‌ సెక్రటరీ, ప్రజారోగ్య అధికారులు రోజు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. డ్రెయిన్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించేవారిపై చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్‌ అంతరాయం కలిగిస్తున్న బిల్డింగ్‌ మెటీరియను తొలగించాలనా ఆదేశించారు.  కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, ఏఈ దుర్గాప్రసాద్‌, బిల్డింగ్‌ ఇన్సెపెక్టర్‌ స్రవంతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-18T10:05:13+05:30 IST