అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-12-13T05:30:00+05:30 IST

అటవీ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని, భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.శివప్రసాద్‌ అన్నారు.

అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు
వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి శివప్రసాద్‌

వాకింగ్‌ ట్రాక్‌కు అడ్డుగా ఉన్న నిర్మాణాల తొలగింపు

డీఎ్‌ఫవో శివ ప్రసాద్‌ 

మంగళగిరి క్రైమ్‌, డిసెంబరు 13: అటవీ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని,  భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు  చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.శివప్రసాద్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని  పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండచుట్టూ ఆటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన టెంపుల్‌ హిల్‌ ఎకో పార్కులో భాగంగా నిర్మాణం జరుగుతున్న వాకింగ్‌ ట్రాక్‌ను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎ్‌ఫవో శివప్రసాద్‌ మాట్లాడుతూ కొండపై అటవీ భూములు ఆక్రమించిన వారిపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు.  ఆక్రమణదారులు వెంటనే తమ ఆక్రమణలను తొలగించకుంటే  చట్టప్రకారం తొలగిస్తామన్నారు. ముఖ్యంగా వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంలో అడ్డుగా ఉన్న  ఆక్రమణలు తొలగించాలని, లేదంటే వారిపై చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల రోజుల్లోనే వాకింగ్‌ట్రాక్‌లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి  ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని, పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో రేంజ్‌ సెక్షన్‌ అధికారులు రామ్మోహనరావు, మల్లిఖార్జునరావులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:30:00+05:30 IST